Search This Blog

Thursday, March 29, 2007

మళ్ళీ విజయనగరం చిన్న నాటి జ్ఞాపకాలకి. మాకు హైస్కూలులో లాఠం చెప్పిన వారిలో బలిజేపల్లి గోదావరిరాజుగారు ఒకరు. చక్కని పంచకట్టుతో మల్లెపువ్వు లాంటి జుబ్బాతో మూర్తీభవించిన తెలుగు హుందాతనం నడిచి వస్తున్నట్టుండేది ఆయన క్లాసుకి వస్తుంటే. యెస్ వీ రంగారావు గాత్ర గాంభీర్యం లేకపోయినా ఆకార గాంభీర్యం మాత్రం వుండేది. ఆ రోజుల్లో మాస్టర్లంటే భయం ప్రేమా రెందూ కలగలిపి వుండేవి. వారు మాకు సోషల్ స్టడీస్ చెప్పేవారు . ఆ మహానుభావుల వద్ద చదవ బట్టే అర్ధశతాబ్దం కింద చదివిన హిస్టరీ జాగ్రఫీ ఇంకా గుర్తున్నాయి. వారి కుమారుడు రామమోహన రావు గారు మెడిసిన్ చదివారు . ఆయన లాగ చదువు కోవాలని చెప్పే వారు మాకు.ఒక సారి మాస్టారు ఒక నెలానెలన్నర పాటు స్కూలు కి రాలేదు. చెప్పద్దూ మాకు కొంచెం పండగ లాగే వుంది అప్పుడు. తరవాత పెద్ద వాళ్ళు అనుకుంటుంటే తెలిసింది. రామమోహనరావుగారూ గాయని సుశీల గారూ ఇష్టపడి పెళ్ళి చేసుకున్నారనీ.ఆ పెళ్ళి కి పెద్దలు ఇష్టపడలేదనీ. ఇద్దరూ ఒక వూరి వారే.ఒక కులం వారే. లబ్ధప్రతిష్ఠులే. అయినా పెద్దల అహంకారాలు అడ్డం వచ్చాయి. తరువాత అంతా మామూలయిందనే అనుకుంటాను. ఆ రోజుల్లో చూచాయ గానే తప్ప పెద్దల విషయాల్లో జొక్యం పిల్లలకి అంతగా వుండేది కాదు .

Friday, March 23, 2007

kirlampudicricket2

మరొ సంవత్సరం క్రికెట్ మాచ్ గురించి చెప్పే ముందు ఒక సంగతి చెప్పాలి. మిత్రులందరమూ కలిసి యెవరినైనా మోత మొయ్యాలంటే వాళ్ళనే కెప్టెన్ చెయ్యడం ఆనవాయితీ గా వుండేది.కొంత మంది అది వారి ప్రజ్ఞా పాటవాలకూ ప్రాముఖ్యతకూ గుర్తింపు అని భ్రమ పడడమూ కద్దు. మరి అందుకే కదా వారిని మోసేది. యిలాంటి కెప్టెన్ల లో మాధవరావు ఒకరు .యింకో సంగతి యేమంటే ఉదయం బాటింగ్ చెసే టీము లో చేరి మధ్యాహ్నం ఫీల్డింగు యెగగొట్టడం కూడా మామూలే.మాధవరావు టాస్ వేసి గెలిచినట్టుగా థంస్ అప్ సిగ్నలు ఇచ్చాడు. [డ్రింక్ కొత్తదయినా సిగ్నల్ పాతదే] వెంటనే గబగబా వెళ్ళి వెంకట రామశాస్త్రి మాధవరావు టీము లో తన పేరు రాసేసాడు. తీరా మాధవరావు మళ్ళీ పెవిలియన్ లోకి వచ్చాక తెలిసింది. అతను అతి తెలివి ప్రదర్శించి ఫీల్డింగ్ తీసుకున్నాడని. మాచ్ చిన్నదైనా కామెంటరీ వగైరాలన్నీ వుందేవి. ముసిముసి నవ్వుల కామెంటేటర్ మాధవ రావుని అడిగేడు . మీరు ఫీల్దింగ్ తీసుకున్నారు. పిచ్ యెలా వుంటుందని భావిస్తున్నారు అని. మధ్యాహ్నం మేటనీ పోయినందుకు ఉక్రోషం లో ఉన్న వెంకటరామశాస్త్రి మైకు లాక్కుని "పిచ్చి ముదిరింది " అన్నాడు.

Thursday, March 22, 2007

kirlampudi cricket

జ్ఞాపకాల ఆకులు ఎగిరెగిరి వస్తుంటే వాటి లోంచి ఒక క్రికెట్ జ్ఞాపకం.ఇది క్రికెట్ సమయం కదా. మేం ఆంధ్ర విశ్వవిద్యాలయం లో పీ ఎచ్ డీ చేస్తున్నప్పుదు వుందే కిర్లంపూడి హాస్టల్ చాలా ప్రఖ్యాతి పొందింది. చాల మంది ప్రముఖ స్థానాల్లొ ఉన్న వ్యక్తులు అక్కడ వుండేవారు. ఆ హాస్టల్ జీవితాన్ని గురించి మరో సారి. ప్రతి సంవత్సరమూ ఒక ప్రత్యేక క్రికెట్ మాచ్ ఆడే వారం. ఒక సం వత్సరం వైఎస్వీఎస్ అనబడేఆ వై.ఎస్. వెంకటసుబ్రహ్మణ్యమూ డి ఎల్ ఎన్ హాం అనబడే దూర్వాసుల లక్ష్మీ నరసిమ్హమూ చెరో టీము లోనూ చేరి ఒకరు బాటింగూ మరొకరు బౌలింగూ మొదలుపెట్టడానికి తయారై ప్రజలం దరినీ భయభ్రాంతుల్ని చేశారు. ఎందుకంటే, రన్ వస్తే ఒకరు ఆ షాటు గురించి ఒక వారం రోజుల దాకా అం రికీ తెలియజెప్పుతాదు. కొట్టకపోతే ఆ బంతి విశిష్ఠత గురించి రెండో వాడి దగ్గర వినాలి. ఇం కో మాచ్ గురించి రేపు

Thursday, March 15, 2007

sri TVL

ఎం ఎచ్ స్కూలు లో మాకు పాఠం చెప్పిన వారిలో టీ వీ ఎల్ నరసిం హం గారు వుండెవారు .ఆ మహాను భావుడి చలవ వల్లే నాకు అంతో కొంత ఇంగ్లిషు భాష అబ్బింది. ఈ రోజుల్లొ తెలుగు మీడియం లో చదవడం పట్ల చిన్న చూపూ వగైరా , వాళ్ళకి ఇంగ్లీషు చాలా కష్టం అవుతుందనడం ఇవన్నీ నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తాయి. టీవీఎల్ గారు నేర్పించిన ఇంగ్లీష్ గ్రామర్ మరిచిపోయేది కాదు. ఆయన ఒకసారి మా మిత్రుడొకడు రోడ్డు పక్క ప్రకృతి పిలుపు తీర్చుకుంటుండగా చూశారు . భయం చెప్పడం కోసం క్లాసు లో ఆ సంగతి ప్రస్తావిస్తూ అలాంటి పనులు చేస్తే రెండు నెలల దాక జైలు శిక్ష పడుతుంది. నేను కూడా కొన్నాళ్ళు అని ఆయన మాట పూర్తి చేసే లోగానే క్లాసంతా గొల్లుమన్నారు.వెధవల్లారా పూర్తిగా వినండి అని ఆయన పూర్తి చేశారు. నేను కూడా కొన్నాళ్ళు ఆనరరీ మేజిస్ట్రేటు గా పని చేసి కొంత మందికి శిక్షలు వేశాను అని అన్నారు. అయినా నవ్వులు ఆగలేదు .వారి మనమడు జీ వీ సూర్యనారాయణ నా క్లాసుమేటూ మిత్రుడూ. ఎం ఆర్ కాలేజ్ ప్రిన్సిపాల్ గా కూడా పని చేసి ఈ మధ్యనే రిటైర్ అయ్యాడు. .

Wednesday, March 14, 2007

my life

సముద్రం మీంచి చల్లని గాలి వీస్తుంటే నీ చల్లని స్పర్శ లా అనిపిస్తుంది. వెన్నెల్లో పడుకుంటే నువ్వు నన్ను చూసి నవ్వుతున్నట్టుంది. యెండాకాలం విశాఖ ఉక్కపొత నీ ప్రేమలో ఉక్కిరిబిక్కిరి అయినట్టుంది . ప్రకృతి అంతా నువ్వే. నువ్వే నా ప్రకృతి

Monday, March 12, 2007

telugu saregamapa

జీ తెలుగు లో సరిగమప కార్యక్రమం క్రమం తప్పకుండా చూస్తున్నాను. ఆ యువత గాత్ర మాధుర్యం విస్మయపరుస్తోంది. అంతకన్నా తెలుగు భాష ని వాళ్ళు పలుకుతున్న తీరు తన్మయపరుస్తోంది. తెలుగుభాష మరుగున పడుతోందని మనమందరం చేస్తున్న కాకిగొల రజ్జుసర్ప భ్రాంతే ననిపిస్తోంది అంతలోనే నన్ను ఎసెమెస్ లతో యిన్నళ్ళూ యెంకరేజ్ చేసినందుకు థాంక్స్ అంటూ వాళ్ళు పలుకుతున్న చిలకపలుకులు చిలక పలుకులు కాకుండా కాకి గోల అనిపిస్తున్నాయి . తెలుగు అంత స్వచ్చం గా మాట్లాడగలిగిన వారికెందుకీబాధ. యిడ్లీ లో సాస్ నంచుకున్నట్టు .కార్యక్రమం రూపొందించే వారు యింకొంచెం శ్రధ్ధ తీసుకొవాలి

Saturday, March 10, 2007

prof ronamki

I was writing about ronamki appala swamy garu. whenever i think of him my heart thrills with ecstacy--his readings of shakepear, milton ,dylon thomas, arudra, pathabhi still replay themselves in my mind. it was teachers like that who made me capable of being alone in a crowd and being in a crowd with all those characters in the books, even when i am alone.. there is never a dull moment in life. thankyou, sir. it was he who made me read sherlock holmes and perry mason to improve my conversational ability. a classical english teacher. that speaks a lot of his vision

stoneworkers.

Today in the hindu metroplus i saw an item about how many buildings in vizag including andhra university and the collectorate are stone buildings. this reminded me of the time when i was deputed to escort an american professor, i dont recall his name, on his visit to andhra university. at that time some building was under construction in the university . as usual there were many workers chiselling stones into almost perferct rectangular cuboids. this being a everyday occurance and usual whenever there was construction, does not attract much attention from the locals. but the american was staring amazedly at the sight from the window of the guest house. ashok, he said to me, i think the pyramids must have been built like this.

Sunday, March 4, 2007

మళ్ళీ విజయనగరం జ్ఞాపకాలు. పాత పుస్తకాల మధ్యన దాచిన ఎండిపోయిన పువ్వుల్లా ఏదొ తెలియని విచిత్రమైన సుగంధాలతో . ఏభై ల లో మినర్వా టాకీసులో తెనాలి రామక్రిష్ణ సినిమా విడుదలయింది . ఆ సినిమా లోని చందనచర్చిత అష్టపదిగురించీ అది పాడిన సుశీల గారి గురించీ యిప్పుడు అందరికీ తెలుసు . అప్పుదు తెలీదు. ఆపాట యింటర్వల్ దగ్గిరలొ వస్తుంది. వొకాయన ప్రతిరోజూ సినిమా టిక్కెట్ కొనుక్కుని ఆపాట వచ్చే సమయానికి హాల్లోకి వచ్చ్చి పాట వినేసి వెళ్ళిపోతుండే వారట. యిలా వారం పది రోజులయే సరికి అందరూ దీన్ని గమనించారు . హాలు మేనేజరు బ్రహ్మాజీ గారు ఆ పెద్దాయన దగ్గరకి వెళ్ళి అయ్యా ఏమిటిలా వస్తున్నారు అని అడిగితే యేమీ లేదండీ ఆ పాట పాడింది మా అమ్మాయే అన్నారటా సుశీల గారి నాన్నగారు .ఆలుక్కరచుకుని[ఆ పెద్దయన వూళ్ళో అందరికీ తెలుసు, యెటొచ్చీ వారమ్మాయి పాటపాడిందని తెలీదు] ఆ రోజునించీ ఆయన యెప్పుడు కావాలన్నా హాల్లో కి వచ్చి కూర్చుని వెళ్ళే యేర్పాటు చేశారు బ్రహ్మాజీ గారు

Friday, March 2, 2007

i did not post for the last 2/3 days. just did not feel like it. mean while i am intrigued by the antics of ramojirao. today eenaadu carried on the frontpage at the top a statement by ramojirao which i felt belonged more to his son suman's stupid serials. does the fact of running a news paper ,we should call it a tabloid, give anybody a licence to do anything they wanted in their other businesses and claim immunity from enquiry or action just because they also happen to run a news paper? one gets the doubt whether this is the reason they started the paper in the first place.we saw the same thing with ramnath goenka earlier. why should a consciencious newspaper editor have a finger in so many pies. we thought an upright editor will steer clear of any thing that may compromise him. of the groups blatantness , everybody knows it. on their channels one health programme sometime back repeatedly was singing the praises of ricebranoil as THE best for health. we know whose company produced ricebran oil under the brand name priya on the same channel they are now running the telugu version of a natgeo documentory. and the producers name is , you guessed it ramojirao. how brazen can you get.