Search This Blog

Monday, June 11, 2007

naani

నేను స్కూలులో చదువుతున్నరోజుల్లొ మా పక్క ఇంటిలో ద్వివేదుల నరసింగరావుగారు వుండేవారు.వారు మహారాజా కాలేజి లో యెకనామిక్స్ లెక్చరర్ గా పనిచేసేవారు. కొంతకాలం తరువాత వారు అమెరికా వెళ్ళడమూ తిరిగి వచ్చాక యు ఎస్ యెద్యుకేషనల్ ప్రోగ్రాం అధికారిగా మద్రాసు వెళ్ళడమూ జరిగింది. వరి సతీమణి విశాలాక్షి గారు తరువత కధా నవలారచయిత్రి గా ప్రసిధ్ధులు. అయితే అప్పటికి ఆమె రచనా వ్యాసంగం యింకా మొదలుపెట్టలేదు. దగ్గరలో ముఫ్ఫయ్యేళ్ళ వయసులో ఆమే ఆమె చుత్తాలమ్మాయి మరొకరూ ఆంధ్రామెట్రిక్ పరీక్షకి హాజరవడం ఆ చిన్నవూళ్ళో కొంత సంచలనమే అయింది. మా రెండు కుటుంబాలూ చాలా సన్నిహితం గా వుండేవి. వారి అబ్బాయి శ్రీనాధ్ నాకు మంచి మిత్రుడు. మా ఇంటి లోనో వాళ్ళింటిలోనో ప్రతివారం తప్పకుందా బాలానందం కార్యక్రమం వినేవాళ్ళం. మా స్నేహితులు కూడా వచ్చే వాళ్ళు. రేడియో వినడానికి ఇంకో ఇంటికి వెళ్ళడం అంటే యిప్పుడు పిల్లలు నవ్వుతారు. ఆఆంధ్రపత్రిక వారపత్రికలో ఆ రోజుల్లో టాం సాయర్, హకల్ బెర్రీఫిన్ స్కార్లెట్ పింపర్నల్ రాజూపేదా వంటి సీరియళ్ళు వచ్చేవి. చందమామలో తోకచుక్క మకరద్వీపం వంటి సీరియళ్ళు వచ్చేవి. యేకాక్షీ చతుర్నేత్రుడూ వంటి పాత్రలు మనసుకి హత్తుకునేవి. అందరం కలిసి చదవడం పైవరమో పై నెలో యేమవుతుందని చర్చించుకోడం యెంతో బాగుండేది. విశాలాక్షి గారు కూడా మాతో చర్చించేవారు. అమెలోని రచయిత్రి ఆ రోజుల్లోనే వికసించిందేమో.అమెరికా వెళ్ళాక నానీ అనబదే శ్రీనాధ్ చదువు అక్కదే గదిచింది. అమెరికాలోనే అతను కారుప్రమాదంలొ చిన్నవయసులోనే మరణించాదు. అతని చెల్లెలు ఛాయ కూదా మాతోనే ఆడుతుండేది.

4 comments:

S said...

చాలా అచ్చు తప్పులు కనిపించాయండీ :(

ద్వివేదుల విషాలాక్షి గారి గురించి ఇదివరలో విని ఉన్నాను. ఆమె రచనలు ఎక్కడ దొరుకుతాయో చెప్పగలరా?

Moyin said...

బావున్నాయండి. స్కూలు విషయాలు ఇంకా గుర్తు ఉండటం చాల విశేషం. రేడియో ఎపిశోడ్ నిజంగా ఆశ్చర్యంగా ఉంది.

AshokJayanti said...

s garu
విషాలాక్షి గారు కాదండి. విశాలాక్షి గారు.

Chandra said...

మీరు చెప్పిన దాంట్లో బాలానందం , చందమామ సీరియళ్లు నాకు కూడా చిన్నప్పటి తీపి గుర్తులే..