Search This Blog
Monday, June 4, 2007
bandaru
బందరు బ్లాగరుడు వ్యాఖ్య పంపించి బందరు జ్ఞాపకాలని వెలికి తెప్పించారు. బందరులో యెందరో మిత్రులు. మా అమ్మమ్మ గారి వూరు కావడంతో చిన్నప్పటి నించీ బాగా అలవాటైన వూరే. కాని యూనివర్సిటీలో మిత్రులైనవాళ్ళు అనేకులు. ఎన్ ఎస్ ఎస్ ప్రసాదూ నాకు ఒక సంవత్సరం జూనియరే. రిసెర్చ్ లో చేరిన మొదటి యేడాది అతని రూములో వుండనిచ్చాడు. చాలా మంచి మిత్రుడు. నా రెండొ కుమారుడి పెళ్ళికి వచ్చాడు. అప్పుడు కలిశాం. నా ఇద్దరు కొడళ్ళూ హైదరబాదు వాళ్ళే కావదం మిత్రుల్ని కలవడానికి అవకాశం ఇస్తోంది . సౌభ్యం అనబడే జీవీవీ సుబ్బారావు ని మిత్రుదు అనడానికి లేదు. ఇంకో ప్రాణం అనాలి. బందరు హిందూ కాలేజి లో ఫిజిక్సు చెప్పేవాడు. మీటియరాలజీ చదివిన ఆదిశేషు మరో మంచి మిత్రుడు. అతని మరణవార్త ఈ మధ్యనే విన్నాను.వృత్తిధర్మంలో రేదియేషను కి గురి అయ్యాడు. యూనివర్సిటీ మిత్రుల గురించి వరుసలో చివరికి రాద్దామనుకున్నాను కాని బ్లాగరుడు తాడు లాగి డొంకని కొంచెం కదిలించాడు. వీళ్ళందరి గురించీ రాయడానికి ఇంకా మజా అయిన సంగతులు బోలెడు. మళ్ళీ చెపుతా. ఇంకా స్కూలు రోజుల్లోనే వున్నాం కదా
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
మాష్టారు గారు నమస్తే - మాది కూడా బందరే. చాలా సంతోషంగా ఉంది. ఈ బందరు బ్లాగరుడు గారు ఎవరు ?
వంశీ
www.maganti.org/index1.html
నాకూ తెలీదు. నా కిందటి పోస్టు కి కామెంటు రాసేరు. కొంచెం కొత్త బ్లాగరుడనుకుంటాను. బందరూ విజయనగరం రాజమండ్రీ గుంటూరూ అంధ్రదెశం జ్ఞాపకాలకి తీపిగురుతులు.సంస్కౄతికి చిహ్నాలు. మీరు కుడా బందరు గురించి రాస్తే బాగుంటుంది
సంతొషం అండి అషోక్ గారు. మీ బందరు విషయాలని తెలుగు సినిమా ఫ్లాష్ బాక్ లా వివరించారు. వంశీ గారు నా మొదటి ప్రయత్నం చదవండి. నా పరిచయం రాసుకున్నాను.
http://bandarblogulu.blogspot.com/2007/05/blog-post.html
Post a Comment