Search This Blog
Thursday, October 11, 2007
hello friends
చాలా కాలమైంది మిత్రులందరినీ పలకరించి.నేను హస్పిటల్ నించి వచ్చిన తరువాత ఒక నెల రోజులు నన్ను చిన్నపాపలా చూసుకున్న నా భార్య కొంత అస్వస్థురాలవడంతో సమయం చిక్కలేదు. మధ్యలో కుంభవృష్టి- యెప్పుడూలేనంతగా మా యింటిలోకి కూడా నీళ్ళు రావడం గందరగొళం అంతా సందడిగా గడిచిపోయింది. యిప్పుదు అంతా కుదుటబడింది.
విజయనగరం జ్ఞాపకాలలో కాలేజ్ వర్ణణ తో మళ్ళీ అక్కడ తిరుగుతున్న అనుభూతి కలిగింది. కాలేజ్ ఊరిమధ్యలోనే వుంది.--ఆ రోజుల్లో. యిప్పుడు మరి వూరెంత పెరిగిందో ఒకసారి వెళ్ళి చూడాలి. నలభై మైళ్ళ దూరంలోనే వున్నా యింతకు ముందే చెప్పినట్టు మనో చిత్రాలేవి చెరిగిపోవలసి వస్తుందో అనే భయం వెళ్ళనీకుండాచేస్తోంది. కాలేజ్ మైన్ గేట్ నించి యెడమవైపు ఒక పెద్ద రోడ్డు వెళుతుంది. మా యింటికి వెళ్ళే దారి అదే.కాలేజ్ యెదురుగానే ఒక చిన్న రామాలయం ఉంది. ఆ రోడ్డు మీద కొంచెం ముందుకి వెళితే ఒక రెండంతస్థుల యిల్లు వస్తుంది. ఆ యింటిలో అప్పుడు ఒక తమిళ కుటుంబం వుండేది. వారమ్మాయి , జయలక్ష్మి అని గుర్తు, మాకు మూడు నాలుగేళ్ళ సీనియర్. అందంగానే వుండేది. చాలా సన్నగా పొడుగ్గా ఉండేది. విద్యార్ధులందరూ ఆప్యాయతతో ఆమెని టాన్ తీటా అని పిలుచుకునే వారు. ఆ యింటి తరవాత రోడ్డు యెడమ పక్కకి తిరుగుతుంది. ఆ రోడ్డు ని ఆను కుని రాజా వారి కోట గోడా దాని చుట్టూ కందకం.అక్కడ కుడిపక్కకి ఒక మట్టి రోద్దు వుండేది. దాని సంగతి తరవాత. మన మైన్ రోడ్డు మీద ముందుకి వెళితేఉదయగిరిసీతారామస్వామి గారి యిల్లు వస్తుంది.ఆయన పెద్ద లాయరు, నేను చిన్నప్పుడు చదివిన లలితా విలాస్ స్కూలు మేనేజరు. వారమ్మాయి వుమన్స్ కాలేజ్ లో లెక్చరర్ గా చేసింది. మేం చదివే రోజుల్లో వుమన్స్ కాలేజ్ లేదు. వారబ్బాయి మాధవరావు మాకు కొంచెం సీనియరే అయినా మిత్రుడు చిన్నప్పుడు అందరం ఆడుకునే వాళ్ళం. ఈ మధ్యనే బాచ్ మేట్స్ సైటులో కలిసి పలకరించాడు. జ్ఞాపకాలు ముంచెత్తుకొస్తున్నాయి. కొంచెం వడబోసి మళ్ళీ రాస్తాను.
Subscribe to:
Post Comments (Atom)
6 comments:
మీ ఆరొగ్యం స్థిమిత పడినందుకూ, తిరిగి మీ జ్ఞాపకాలు మొదలెట్టినందుకూ సంతోషం అశోక్ గారూ.
అక్కడి కుడివైపు సందులో సంగీత కళాశాల. ఆ రెండస్తులమేడమీదుగా మరికొంచెం ముందుకుపోతే, ఫిజిక్సు లెక్చెరెర్ జగన్నాధరావుగారిల్లు. మరికాస్త ముందుకుపోతే ఢంకేషావలీబాబా దర్గా, బొంకులదిబ్బ, దానికెదురుగా కోట. ఇప్పుడు కూడా అలాగే ఉందండీ -- కాని బొంకులదిబ్బకెదురుకుండా ఉన్న కందకాన్ని పూడ్చేసారు, అక్కడంతా ఇప్పుడు షాపుంగు కాంప్లెక్సులు కట్టేరు. ఆ దర్గా దగ్గర ఎడమవైపు పోతే, ముందుగా గుండాలవారి వీధినానుకొని అప్పట్లో ఎ.ఎల్.నారాయణగారి బంగ్లా ఉండేది, అది ఆ తర్వాత ఎల్,ఐ.సి వారి ఆఫిసుగా మారింది. అక్కడనుంచి మరికాస్త ముందుకు పోతే గుమ్చీ, అయ్యకోనేరు, తూర్పుగట్టుదగ్గర పెద్ద ఆంజనేయస్వామి కోవెల.
మీరు చెప్పిన రామమందిరం పక్కనే ఒక ఐస్-క్రీమ్ ఫాక్టరీ ఉండేది మారోజుల్లో. ఈ టాన్-తీటా ముద్దుపేరు మీ టైములోదా? అది ఇప్పటికీ అలా చిరస్థాయిగా అలానే ఉంది - సన్నగా, పొడుగ్గా సరళరేఖలా ఉండే సన్నజాజులకిప్పటికీ అదే పేరు.
inthakee sannaga unna ammayilani tan theta ani enduku antaaru??
dear rsg,
చిన్నప్పుడెప్పుడో చదివిన మాట గుర్తుకొస్తోంది
if you have to ask, you can't afford it
సన్నగా పొడుగ్గా వున్నారు కాబట్టే టాన్ తీటా అనడం
లాజిక్ ఇంకా అర్థంకాలేదు మాస్టారూ, ఈ మట్టిబుర్రగాడిని క్షమించేసి, కాస్త సన్నగా పొడుగ్గా ఉన్న అమ్మాయిలని టాన్ తీటా అని ఎందుకంటారో చెప్పేయండి ప్లీజ్ !!!!
I know sin/cos = tan and probably tan may be an allusion to Tangent of the circle. But Iam not able to relate these things to girls :(
ఎప్పుడో మర్చిపోయినదాన్ని గుర్తుచేసినందుకు ఏమీ అనుకోవద్దు, మొన్నే మా ఆఫీసులో నా క్యూబ్ పక్కన ఒక సన్నటి, పొడుగాటి అమ్మాయి వచ్చి కూర్చుంది. అప్పుడు చటుక్కున మీ టాన్ తీటా గుర్తుకొచ్చింది. అందుకే మీరేమైనా అర్థమ్ సెలవిచ్చారేమో అని వచ్చి చూస్తే మీరేమీ చెప్పలేదు :(
Post a Comment