డాక్తరే రైటని తేలింది.నిన్ననే ఆంజియో ప్లాస్టీ చేసి చిన్నదాంట్లొనే కాని ఒక పెద్ద అడ్డమే ఉందని తేల్చారు.వచ్చే శనివారం ఒక బెలూను ఊది స్టెంటు పెడతారట. చేతిలో కన్నం పొడవడం చాత కొంచెం నొప్పి పెడుతోంది. రేపు మళ్ళీ కలుస్తా.
ఈ సారి మనసులో పాట గోదావరి లోని రామచక్కని సీత.నిజంగా యెంత చక్కనిభావన.పుడమి అల్లుడు రాముదు.అందరికీ తెలిసిన సంగతే ఐనా యెంత చక్కగా ఉంది!.అలాగే నల్ల పూసైనాదు దేముడు నల్లనీ శ్రీరాముడు. ఇంకా యెడమచేతను శివుని విల్లును యెత్తినా ఆ రాముడు యెత్త గలడా సీత జడను తాళికట్టే వేళలో.వేటూరి వారికి యెన్నిసార్లు చెయ్యెత్తి మొక్కాలి? ఒకవేళ వారుకాకపోతే అనితరసాధ్యమనుకున్నదాన్ని సాధ్యం చేసిన వారికి జోహార్లు.
2 comments:
Take care of ur health and take good food and rest. no tension. this is common now a days . may god bless u with good health and no problems in life..
తెలుగు బ్లాగ్లోకానికి మీ హృదయ కవాటాలు తెరిచారు. ఆ కవాటాలకి అడ్డం పడటానికి ఆ జబ్బుకి ఎన్ని గుండెలు? మా అందరి అభిమానం దాన్ని పటాపంచలు చేస్తుంది లెండి.
Post a Comment