Search This Blog

Friday, April 6, 2007

head master

ఇతరత్రా వ్యస్తుడనై ఉండడం వల్ల కొంతకాలం ఇక్కడకి రాలేకపోయాను. మా బడి జ్ఞాపకాలను ప్రధానోపాధ్యాయులు రామదాసు గారి గురించి చెప్పి తరువాత ముందుకు సాగుతాను, వారిని చూస్తే అందరికీ దడ. వారు యెప్పుడూ యెవరినీ పల్లెత్తు మాట అన్నట్టు యెవరూ చూడలేదు.వారి గంభీర వ్యక్తిత్వం తోనే అది సాధ్యమనుకుంటాను. నా ఉపాధ్యాయ జీవితం లో ఈ అనుభవాలు చాలా సాయపడ్డాయి. మాకొక తెలుగు మాస్టారు ఉండేవారు. ఆయన ఆకారవికారాల వలన తొండబుర్ర అనే ముద్దుపేరుని సంపాదించారు. ఆ పేరు ఎవరు పెట్టారో యెప్పుదు పెట్టారో ఎవరికీ తెలియదు . ఆయన అసలు పేరు నాకు ఇప్పటికీ తెలియదు. ఒకసారి అర్ధసంవత్సరపరీక్షలు జరుగుతున్నాయి. నేను రాసేదంతా అయిపోయీ నా మిత్రుడొకదు రాయడానికింకేమీ మిగలకా కొంచెం ముందుగానే బయటపడ్డాం. పిల్లచేష్ఠలతో అక్కడేదో ఇసక కుప్ప వుంటే గంతులేస్తున్నాం. ఇంతలో ఏం చేస్తున్నారు అని గంభీర స్వరం వినిపించింది. రామదాసు గారు. బిక్కచచ్చిపోయాం. నెమ్మదిగా నోరు పెగుల్చుకుని పరీక్ష రాయడం అయిపోయింది అన్నాను. మరో ప్రశ్న, యే రూము లో రాశారు. చెప్పాం. యిప్పుడు కష్టం ఒచ్చి పడింది. వాచరు యెవరు ? అని అడిగేరు. తొండబుర్ర గారు అని చెప్పాలి. యెలా?. హెడ్మాస్టరుతో?. చిన్న బుర్రలోని తెలివితేటలన్నీ ఉపయోగించి యేమయితే అదయిందని టీ బీ గారండి అనేశా. తల తాటించి వెళ్ళిపోయరు. అమ్మయ్య అనుకుని స్కూలు బయటకి పరుగో పరుగు. పెద్ద క్లాసు లకి వచ్చి రామదాసు గారు మాకు లెక్కలూ జామెట్రీ చెప్పినప్పుడు తెలిసింది. ఆయన అంత భయంకరుడేమీ కాదని.

1 comment:

cbrao said...

నా కాలేజ్ రోజుల్లో మాకు ఇద్దరు లెక్కల అయ్యవార్లు వుండేవారు. ఒకరు నల్లగ, ఇంకోరు ఎర్రగా ఉండే వారు. అంతే మరి వాళ్ళకు nick names వచ్చేశాయి. Mathematics Black , Mathematics Red అని. పేర్లు పొడుగ్గా ఉన్నవని క్లుప్తంగా M.B. అని M.R. అని పిల్లలు వాళ్ళ సంభాషణలలో వ్యవహరించేవారు.