Search This Blog

Friday, February 23, 2007

ronamki appalaswaamy

నిన్నటి సందెశం లో ఉద్దేశపూర్వం గానే ఒక మహా మనీషి ని పేర్కోడం మానాను. ఆచార్య రోణంకి అప్పలస్వామి గారిది మాటల కందే వ్యక్తిత్వం కాదు. ఒక మనిషికి అంత పాండిత్యం ఉండడం సాధ్యమేనా అని మా సహోధ్యాయులం ఆశ్చర్యపోయిన సందర్భాలు అనేకం. ఆయన కావడానికి మా యింగ్లీషు లెక్చరర్ .కాని క్లాసు లో మాకు ఆయన గీత గోవిందాన్నీ పథాభి పంచాంగాన్నీ ఫిడేలు రాగాలు డజన్ నీ ఆరుద్ర త్వమేవాహాన్నీ వినిపించి తన్మయుల్ని చేసిన సందర్భాలు అనుభవైకవేద్యాలు. మాక్ బెత్ నాటకాన్నీ మిల్ టన్ పారడైస్ లాస్ట్ నీ ఆయన బోధించిన విధానం జన్మ జన్మ లకీ మా మనొఫలకాల మీద ఆ సాహిత్యం ముద్రించుకుపోయేలా చేసింది. యెంతదాకా అంటే చెపుతా ఆ బియెస్సీ యెం ఆర్ కాలేజి అంతా అయి పోయిన దశాబ్దాల తర్వాత నేను పూర్తిగా ఫిజిక్సూ ఇన్ స్త్రుమెంటేషనూ లో మునిగి తేలుతున్నా ఒక కాలేజ్ కి ఇంటర్వ్యూ కమిటీ లో కూర్చుని ఒక యింగ్లీషు లెక్చరర్ ఉద్యోగానికి వచ్చిన అతనికి లార్డ్ అఫ్ ది ఫ్లైస్ అంతే బీల్ జి బబ్ అని గుర్తు చేసేంత .ఆ కాలేజి ప్రిన్సిపాల్ అప్పలస్వామి గారి కుమారుడే అవడం కొసమెరుపు అప్పలస్వామి గారు నాకు వ్యక్తిగతం గా నేర్పిన విషయాలు మరొసారి.కానీ ఆయనకి మాకియవెల్లి రాజనీతి శాస్త్రాన్ని తెలుగు లోకి అనువదించినందుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ వచ్చిన సంగతి గుర్తు చేసుకోడం బాధ్యత

No comments: