Search This Blog
Friday, February 16, 2007
అరవయ్యవ దశకంలొ విజయనగరం సిటీక్లబ్ లొ టెన్నిస్ పోటీలుచాలా బాగా జరిగేవి.కృష్ణన్, లాల్, ముఖర్జీ నస్తత్సె వంటి ఆటగాళ్ళని చూసే అవకాశం ఆ చిన్న వూళ్ళ్లో కలిగిందంటే నారాయణరావుదొర గారిని మరీమరీ తలచుకోవాలి.ఆటచూసి వెన్లక్ లైబ్రరీ పార్క్ లో గడ్డి మీద కూర్చుని గప్పాలు కొట్టడం ఒక మంచి అనుభూతి
ఆ రొజుల్లొనె న్యూ పూర్ణా హాలులో దిల్ తేరా దీవానా సినిమా రిలీజయింది ఆరొజు మాచ్ చూసి సినిమా కి వచ్చాం . ప్రేంజిత్ లాలూ జైదీప్ ముఖర్జీ హాలు బైట తచ్చాడుతున్నారు .హౌస్ ఫుల్ బోర్దుచూసి సంగతి అర్ధమయింది. మా దగ్గర 60 పైసల టిక్కెట్లు వున్నై . వస్తారా అని అడిగితే మహా సంతోషం గా వచ్చి మాతో పాటు వేరుశనగపప్పులు తింటూ ఎంజాయ్ చేశారు.
నిజం గానే వాళ్ళు కావాలంటే హాలు వారు టిక్కెట్ ఇవ్వరా మర్యాదలు చెయ్యరా
భేషజాలు లేని ఆ మనుషులు వేరు.
ఆరోజులూ వేరే
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
ఫ్రొఫసర్ అశోక్ గారు,
మాదీ విజయనగరమే. ఆ వూరు వదిలేసి చాల కాలమయ్యింది. ఈ మధ్యనే అక్కడకి వెళ్ళినపుడు కొన్ని ఫొటోలు తీసేసు - బాబా మెట్ట నుంచి, గంటః స్తంభం దాకా. ప్రోసెస్ చెయ్యగానే మీకు లంకె పంపిస్తాను.
-- నాగరాజు పప్పు
e-తెలుగు ప్రపంచానికి సుస్వాగతం :-)
Post a Comment