Search This Blog

Friday, October 19, 2012

తమ్మావారు

అప్లైడ్ ఫిజిక్సులో నా చదువు ని గురించి చెప్పేటప్పుడు తమ్మా కామేశ్వరరావుగారిని తలుచుకోకుండా ఉండడం చాలా కష్టం.సాత్విక భోజనంలో నంచుకోడానికి పచ్చిమిరపకాయలాగ ఆరోజుల్లోని ఫాకల్టీలో ఆయనొక్కడే కాస్త సెన్స్ అఫ్ హ్యూమర్( క్షమార్హుడిని ఎంత ఆలోచించినా దీనికి తెలుగు పదం కొన్నేళ్ళుగా దొరకడంలేదు) ఉన్న మనిషి.మిగిలినవారంతా బిగుసుకు పోయి ఉండేవారు.        
అంతేకాకుండా ఆయన చాలా వాక్శుధ్ధి ఉన్న ఉపాథ్యాయుడు.నాఉద్దేశం ఆయన ఏదైనా చెపితే అది కళ్ళకి కట్టినట్టు అనిపించేది.కళ్ళముందు హోలోగ్రామ్ లాగ ఆడేది. దీనికి మంచి ఉదాహరణ టార్షన్ స్ట్రైన్ గురించి ఆయన మాకు చెప్పినది. కేవలం చేతులు తిప్పుతూ టార్షన్ వల్ల వస్తువు ఏరకంగా విరుగుతుందో ఆయన చూపిన తీరు యిప్పటికీ
ఏభై ఏళ్ళతరవాతా నా కళ్ళముందు కదుల్తోంది. ఒక రకంగా ఆయన నాకు ఇన్ స్పిరేషన్ అని చెప్పాలి. ఆ మహాను భావుడి కొరడాల్లాంటి రిపార్టీలు చాలా ఉన్నాయి సందర్భాన్ని బట్టి చెప్తాను.

1 comment:

శ్యామలీయం said...

> సెన్స్ అఫ్ హ్యూమర్( క్షమార్హుడిని ఎంత ఆలోచించినా దీనికి తెలుగు పదం కొన్నేళ్ళుగా దొరకడంలేదు)

ఈ అర్థంలో 'సరసత' అనేమాట వాడతాం తెలుగులో.