Search This Blog
Sunday, December 21, 2008
drying up
నాలుగు దశాబ్దాలకిందటి మాట.అప్పట్లో జె బాపురెడ్డి గారు విశాఖలో ఉండేవారు. మా అక్క తురగా జానకీరాణి ఏదో పని మీద ఇక్కడికి వచ్చి పాత మిత్రుణ్ణి చూడాలని నన్నుకూడా తీసుకుని వెళ్ళింది.వాళ్ళ పిచ్చాపాటీలో ఆయన్ని అడిగింది .మీకెప్పుడైనా ఒకసారి యేమీ రాయలేకుండా అయిపోతుందా అని. తనకి ఉన్నట్టుండి అలా అయిందని యేదన్నా రాద్దామంటే అసలు మనసు పుట్టడంలేదనీ అంది. ఆయనేదో సమాధానం చెప్పారనుకోండి. నేను మాత్రం కుర్రతనపు వేడిలో వాళ్ళ హిపోక్రసీ కి నవ్వుకున్నాను. ఈ మధ్యనే ఆ బాధేమిటో తెలిసింది. కొన్ని దశాబ్దాలుగా ఫిజిక్సో ఎలెక్ట్రానిక్సో కధలో బ్లాగులో అదేపనిగా రాస్తూనే పోయినా గత నెల రోజులుగా మనసటుపక్క పోవడంలేదు. ఈ రోజే కొంచెమైనా చెయ్యి కదిలింది. నన్ను రాయమన్న కంపెనీలన్నీ జుట్టు పీక్కుంటున్నాయి. ఇద్ మొదలేమో అని ఆశగా వుంది.
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
పెద్దలు మీకు తెలియంది ఏముంది?
రైటర్స్ బ్లాక్
http://en.wikipedia.org/wiki/Writer%27s_block
మీరు వైజాగులోనే ఉన్నట్లైతే అన్యధాభావించక
devarapalli.rajendrakumar @gmail.com కి ఒక బ్లాంక్ మెయిల్ పంపగలరు.
Post a Comment