Search This Blog

Thursday, October 23, 2008

bahukaladarsanam

కంప్యూటర్ మీద కూర్చున్నప్పుడల్లా నా మనమరాలు వొళ్ళోకెక్కి మారాం చెయ్యడంచేత ఇన్నాళ్ళూ పోస్టు చెయ్యడం కుదరలేదు. మనమరాళ్ళతోనూ కొడుకూ కోడలు తోనూ కాలం ఆనందంగా గడిచిపోయింది.ఇప్పుడు మళ్ళీ విశాఖపట్నంలో నా ఇంట్లో వున్నాను. సియాటిల్ లో ఉన్నప్పుడే విశాఖలోనే వుండే మా పెద్దబ్బాయి కూడా వేరే పని మీద సియాటిల్ రావడం అందరంకలిసి కాలం గడపడం ఒక మెరుపు. అన్నదమ్ములిద్దరూ చాలాకాలంతరవాత వాళ్ళిద్దరే కలిసి వూరిమీద రెండురోజులు బలాదూరు తిరిగారు.కాలేజిరోజులతరవాత దాదాపు పదిహేనేళ్ళకి. మా కోడలూ మేము వాళ్ళని రెండు రోజులు వొదొలేశాం.తిరుగు ప్రయాణంలో కొంత కష్టం కలిగింది- మా విమానం యే సీ చెడిపోయి వెనక్కి ఆంస్టర్డాం వెళ్ళిపోవడంతో. కట్టు బట్టలతో ఒక రోజుండాల్సి రావడమూ ఇండియా వచ్చేక హైదరాబాదు నించి విశాఖ కి రిజర్వేషన్లన్నీ వృధా కావడమూ ఇత్యాదులు.ఉపేంద్రనాధ్ గురించి చెప్పాల్సిన చోట ఆగాను. మళ్ళీ రేపు మొదలు పెడతాను.

2 comments:

ఏకాంతపు దిలీప్ said...

అవునండి అశోక్ గారూ.. ఇప్పుడు నా మనసులో పాట కూడా అదే... వేటూరికి పాదాభివందనం చెయ్యాలనిపించింది...
మీరు చూపించిన ఆ నాలుగు ముక్కలే నాకు తెగ నచ్చేసాయి...

కొత్త పాళీ said...

సియాటిల్ వచ్చి వెళ్ళారా .. పిల్లల్తో, మనుమలు మనుమరాళ్ళతో గడిపి వెళ్ళారా ... సంతోషం. మళ్ళీ మొదలెట్టండి కబుర్లు