Search This Blog
Saturday, August 9, 2008
hanumamtuDu
హనుమంతుడు పరీక్షల్లొ పెట్టిన ఇబ్బంది చెప్పాను కదా. మొదటిసారి పార్ట్ వన్ పరీక్షకి వెళ్ళినప్పుడు వాడేమాత్రం చదివాడో మీకీ పాటికి తెలుసు.ఎలెక్ట్రికల్ మెషిన్స్ ప్రాక్టికల్ కి వాడితో కలిసి భయం గానే వెళ్ళాను. సీతాపతిరావుగారు ఎక్స్టర్నల్ ఎక్జామినర్. వీడికి యేదో ప్రాక్టికల్ వస్తే నాకు రాదన్నాడు .నీకేదొచ్చు అని అడిగారాయన. వీడికి ఇండక్షన్ మోటార్ అయితే పెద్దగా యేమీ చెయ్యక్కరలేదని మాత్రం తెలుసు అందుకని అది చేస్తానన్నాడు. కాల్క్యులేషన్స్ యెక్కువ వున్నా ఆ సంగతి తరవాతనుకున్నాడు. కాని ముందుగానే వాణ్ణే వైవా కి పిలిచాడాయన. మరి వీడికేం రాదుగా. తెల్లమొహం కాస్సేపు చూసాక నీకేం తెలుసో చెప్పమన్నారాయన.జనరల్ ఫిజిక్స్ యేదైనా అడగమన్నాడు. ఆయన సరదాగా ఎలె క్ట్రాన్ స్పీడెంత అన్నారు. నేను నా ప్రాక్టికల్ మానేసి ఇది జాగ్రత్తగా వింటున్నాను.కరక్ట్ జవాబు చెప్పేశాడు . వూరుకోవచ్చుగా-- యెలా కొలుస్తావని అడిగాడాయన.కుర్చీలో ఇబ్బందిగా అటూఇటూ కదిలేక చెప్పేశాడు.186000 మైళ్ళ పొడుగున్న దారం ఒకటి తీసుకోండి. దానికి ఒక చివర ఎలెక్ట్రాన్ని వదిలి రెండో చివరికి యెంతసేపట్లో వెళుతుందో చూసుకోడమే.!!!! అవాక్కవడం అందరి వంతూ.
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
186000 మైళ్ళ పొడుగున్న దారం ఒకటి తీసుకోండి. దానికి ఒక చివర ఎలెక్ట్రాన్ని వదిలి రెండో చివరికి యెంతసేపట్లో వెళుతుందో చూసుకోడమే.!!!!---హ్హాహ్హాహ్హ :)
కత్తి లాంటి జవాబు ఇచ్చారు మీ మిత్రుల వారు. :-)))) ఆ examiner ఎవరో గాని మరలా డ్యూటి వేయించుకొని ఉండరు.
ఆ దెబ్బకి ఆ సంవత్సరం మరెవరినీ వైవా చెయ్యలేదాయన.మరో ఆరునెల్లకి రిటైరై తొందరగానే కన్ను మూశాడు. ఇలాంటి కధే మరోటికూడా ఉంది. మరో సందర్భంలో మరో ఐదేళ్ళ తరవాత.సందర్భానుసారంగా చెప్తాను.
Post a Comment