Search This Blog
Saturday, February 2, 2008
vijayanagaram
విజయనగరం జ్ఞాపకాలు ముగిద్దామనుకుంటే ముగిసేవికాదు. ఆ వూరి సుగంధమే అంత.ముద్దుక్రిష్ణ, పెద్దిరాజు, జగ్గప్ప, మల్లపరాజుగారు, ఇనపదేముడనబడే నారాయణస్వామి గారు, రామశరమ, ఎం ఎస్ ఆర్ కేఅ, రామా, చంద్రశేఖరశర్మగారి దుర్యోధన యేకపాత్రాభినయం, వీ వీ బీ రామారావుగారు, భాస్కరరామమూర్తిగారు,స్యాంసుందర్ గారు, ఢిల్లీ నీలాచలరావు గారు, ఏ యూ ఎస్ యూనియన్ భవనంలో మేం చేసిన అల్లర్లు, మచ్చ గాడనబడే వెంకటరావు,టీ Yఏఆ నాయుడనబడేఅ అప్పలనాయుడు, సాయినాధరావు, అహ్మద్ ,వరహాలు, చైనా డాక్టరు కొడుకు, శాస్త్రి, రామదాసు, పార్ధసారధి, సత్యమూర్తి, బులుసు వారి పుస్తకాలషాపు, డీఫీ శాస్త్రి గారి పుస్తకాల షాపు, దేవీ విలాస్, నియొ మలబార్ హోటల్ లొ స్పిన్నర్ చంద్రశేఖర్ తో కలిసి మసాలాదోశ తినడం, యెన్ని స్మృతులు. వీళ్ళలో యెవరన్నా మీకూ తెలిస్తే రాస్తారా
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
ఇందులో చాలామందే నాకు తెలుసండీ - సాయినాధరావు గారు హైస్కూల్లో మా లెక్కల మాస్టారు. మాంఛి సరదా మనిషి. ఆయన లెక్కల కంటే, ఎక్కువ క్రికెట్ కబుర్లూ, చమత్కారాలే ఎక్కువుండేవి. గుఢచారులవారి వీధిలో ఉండేవారు. కొన్నాళ్ళు ట్యూషనుకి కూడ వెళ్ళేను. ఉదయాన్నే ఆరింటికి రమ్మనే వారు - కాని, ఆయన ఏ ఏడుంబావుకోకాని లేచేవారు కారు. స్కూల్లో ఏవైనా ఫంక్షన్లు అయినప్పుడు - మైకులు, స్టేజీ ఎరేంజిమెంట్లూ ఆయన ఆధ్వర్యంలోనే జరిగేవి. హెడ్మాష్టరుగా రిటైరయ్యారు.
వివిబి రామారావుగారు కూడా డిగ్రీ చదువుకొనే రోజుల్లో ఒక ఏడాది ఇంగ్లీషు పాఠాలు చెప్పేవారు. ఆయనకి పాఠం చెప్పటం కన్నా, నేనెంతో బాగా చెప్తున్నానన్న ఫీలింగే ఎక్కువ :-) హిందూ పత్రికకి కొన్ని వ్యాసాలు, లోకల్ న్యూసూ రాసేవారనుకొంటా. కానుకుర్తివారి వీధిలో కదూ వారిల్లు?
ముద్దుక్రిష్ణగారు కూడా తెలుసుకాని అంతగా పరిచయం లేదు - ఆయన జిల్లా పరిషత్ స్కూల్లో కదా పనిచేసేవారు? కల్చురల్ ఏక్టివిటీస్ లో చాలా చురుగ్గా ఉండేవారనుకొంటా. ఒకసారెప్పుడో వారిటింకి వెళ్ళినట్టు గుర్తు - వాళ్ళావిడ కూడ వీణ అనుకొంటా - వాయించేవారు.
నారాయణస్వామిగారు తెలుగు లెక్చెరెరుకదా? సారాకొట్టుండేది ఈయనకేనా?
బులుసువారి పుస్తకాల షాపంటే హింమాంశు బుక్ డిపోనే కదా? ఇప్పుడు అక్కడ నోటు పుస్తకాలు, పాఠ్యపుస్తకాలే ఉన్నాయి. దేవీ విలాస్ కూడా మూల పడింది. అప్పట్లో - వింటే కుమ్మరి మాస్టారి బుర్రకథ వినాలి, తింటే దేవీవిలాస్‌లో మినపట్టు తినాలి అని బొంకులదిబ్బ సామెత. నియోమలబార్ హొటలంటే, కన్యకాపరమేశ్వరి గుడి దగ్గరుండేది - పెద్దబజారులో - అదేనా?
--నాగరాజు
(http://canopusconsulting.com/salabanjhikalu)
Post a Comment