Search This Blog

Thursday, January 24, 2008

tan theta one more time

ఆర్ ఎస్ జీ గారికి. మీ సందేహానికి సమాధానం పోస్టు ద్వారా ఇస్తున్నందుకు మీరేమీ అనుకోరనే భావిస్తున్నాను. అరటిపండు ఒలిచినట్టే చెప్పానని అనుకున్నాను.కదళీఫలం అనుకున్నది నారికేళం కూడా అవవచ్చని వూహించలేదు.పప్పు నాగరాజు గారు వెంటనే పట్టుకున్నారు. వారూ విజయనగరం వారు కావడం వల్లనేనా.[ జై విజయనగరం] తీటా గ్రీకు అక్షరంతెలుసుకదా సాగదీసిన కోడిగుడ్డు నిలుచున్నట్టుంటుంది అంతకన్నా మరేం లేదు. పైగా టాంజెంటు కూడాకలిస్తే గీత అని కూడానేమో. నిజానికి ఇది నా టిప్పణి మాత్రమే. ముద్దుపేర్లకి లాజిక్కేమీ ఉండక్కరలేదు--అందరి నోళ్ళలోనూ నాని రుచిగా తయారవడం తప్ప. విజయనగరం జ్ఞాపకాలు బాగా సాగుతున్నాయని ముగిద్దామనుకున్నాను.విశాఖ పూర్తిచెసేటప్పటికి చెయ్యలేనంత వృధ్ధాప్యం వస్తుందేమోనని.అయితే మిత్రులు చాలామంది వద్దువద్దని ప్రోద్బలిస్తున్నారు. మరి కాదనలేక కొనసాగిస్తున్నాను. సిటీ క్లబ్ టెన్నిస్ పోటీల గురించి ఇంతకు ముందొకసారి ప్రస్తావించాను. అక్కడ టెన్నిస్ చూడ్డానికి టిక్కెట్టు కొనడం కుర్రాళ్ళకీ కొనిపించడం క్లబ్ వాళ్ళకీ సమస్యగానే వుండేది. యెందుకంటే ఆట చూడకుండా యెంట్రీ గేటు దగ్గర ఉండే టెన్నిస్ ఫాన్లు యెవరుంటారు? సిటీక్లబ్ పేకాట క్లబ్ కూడా కావడం పనికొచ్చింది. కరడు గట్టిన వృధ్ధ పేకాట రాయుళ్ళనిద్దరిని యెంచారు. వాళ్ళిద్దరికీ ఒక టేబుల్ గుమ్మని కడ్డంగా వేసి హాండ్ తు హాండ్ మీక్కావలసినంత సేపు ఆడుకోమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హరి మీద గిరిపడ్డా వరింక అక్కడినించి కదిలే వారు కాదు. లోపల నస్టసే లాల్ మాచ్ అవుతోంది చుడరా అని బుట్టలో పడేద్దామంటే వాళ్ళెవరు? నా కౌంట్ ఆడు కడతాడా అని కసిరే వారు. అయ్యా అదీ సంగతి.

2 comments:

RG said...

థాంక్స్ మాస్టారూ, నేను టాంజెంట్ దాకా వచ్చాను, కానీ అక్కడ కథంతా తీటాలో ఉందన్నమాట :)

Anonymous said...

Good for people to know.