Search This Blog
Monday, December 31, 2007
krantikumaar
ఆ సుడిగాలి వెంకే కర్రపుల్లలూ ఆకులూ కొట్టుకొచ్చినట్టు కొంతమంది యువకులు కూడా పరిగెత్తుకొచ్చారు . మా అబ్బాయి ఎన్ టీ ఆర్ , కృష్ణ సినిమాలు వంటపట్టించుకుని ఇప్పుడు ఫైటింగవుతుందా అని అడిగేడు.క్రాంతి నా వెనకాలకి వెళ్ళి నిలబడ్డాడు.యెవరు మీరు అని అడిగేడు పెద్ద కర్రపుల్ల. చెప్పాను. యూనివర్సిటీ ఉపాధ్యాయుడిననీ కొంతకాలం ముందు క్రాంతి మిత్రుణ్ణనీ.విజయనగరం కాలేజిలో కలిసి చదివామనీ చెప్పాను. మీరు క్రాంతిని కలిసి యెన్నాళ్ళయింది అని అడిగేడు. అప్పటికి పదిపన్నెండేళ్ళయింది. ఆ మాటే చెప్పాను. మధ్యలో కలవనేలేదా అని సందేహంగానే అడిగేడు. లేదన్నాను. అప్పటికి కొంచెం సమాధానపడ్డాడు.నేనెక్కడుండేదీ చెప్పి క్రాంతిని మర్నాడు మా యింటికి పంపించమన్నాను. నేను యెవరినో తెలిసేక కొంచెంలొంగి వచ్చారు. సరే నన్నారు. క్రాంతికి ఏమీ భయం లేదనీ మర్నాదు నా దగ్గరకి రమ్మనీ చెప్పి ఇంటికి వెళ్ళ మన్నాను. కొంచెం బిక్కుబిక్కుగా చూసేడు. ఉండేదెక్కడని కర్రపుల్లలని అడిగేను . యెదురుగా వున్న ప్రెస్సే ఇల్లన్నారు. నేను కూడా లోపలకి వెళ్ళి క్రాంతిని గదిలోకి వెళ్ళమని వాడు వెళ్ళాక కర్రపుల్లలని అడిగేను. అసలీ డ్రామా అంతా యేమిటని.సార్ మీతో చెప్పడానికేమిటి. క్రాంతిబాబు మా వూళ్ళో ఒక అమ్మాయిని ప్రేమించానంటున్నాడు.ఆ అమ్మాయి కనపడకపోతే చచ్చిపోతానని గోల మొదలు పెట్టి పిచ్చి చేష్టలు చెయ్యడం కూడా మొదలు పెట్టాడు. అందుకని వాళ్ళ బాబాయి గారు ఇక్కడైతే జాగర్తగా వుంటాడని మమ్మల్ని కాపలా పెట్టారు. యీ ప్రెస్సు వాళ్ళదే అని చెప్పారు.గాలితీసిన బుడగలాగా అయ్యేను. నేనేదో డ్రమాటిక్ గా నక్సలిజమూ అండర్ గ్రౌండూ అన్నీ వూహించుకుంటే ఇలా చింతకాయపచ్చడి బయటకొచ్చింది. సరే రేపు నా దగ్గరకి పంపండి నేను చెప్పి బాగుచేస్తాను అని తిరుగు ముఖం పట్టేను. ఇంటికి వెళ్ళాక మా రెండో వాడు మంచి సీనులో తను లేకపోయినందుకు చాలా చింతించేడు.
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
ప్రొఫెసర్ అశోక్ గారికి అభివాదాలు నేను గత నవంబర్ 15 నుంచి తెలుగులో బ్లాగు మొదలుపెట్టి,మీ గత క్రాంతికుమార్ చూసి,ఇప్పుడు కామెంటు రాస్తున్నాను.నేను విశాఖపట్నం వాసినే.సీతమ్మధార లో ఉంటాను.గతనెల రోజుల నుంచీ వైజాగ్ బ్లాగర్ల సమావేశం ప్లాను చేస్తున్నాను.మిమ్ముల్నో సారి కలవాలని అనుకుంటు న్నాను. మీకు వీలయినప్పుడు నాకొక ఫోను చేయగలరు.9866021972 మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సం వత్స్రర శుభాకాంక్షలు.
Post a Comment