Search This Blog

Monday, May 23, 2011

choti choti baatein

పొద్దున్నే లేచి టీవీ ఆన్ చేస్తే ఆనంద్ పాటలు వస్తున్నాయి.ఛోటీ ఛోటీ బాతోంకి హై యాదే బడీ. ఎన్ని జ్జ్ఞాపకాలు... అమ్మమ్మ పెట్టిన పెసర ఆవకాయ... అమ్మ చేసిన దొండకాయవేపుడు...కిర్లంపూడి హాస్టల్లో చేమ ఫ్రై.... నాభార్య చేసే వంకాయ పుల్లబజ్జి... ప్రేమ్ జిత్ లాల్ తోకలిసి 60పైసల టిక్కట్ తో దిల్ తేరా దివానా చూడడం.. ఆషుతో కలిసి సైకిల్ మీద పబ్లిక్ గార్డెన్ కి వెళ్ళిన రోజులు, పెదనాన్న గారితో రిక్షా మీద వెళ్ళి చార్ మినార్ దగ్గిర ఐస్ తేవడం.. ఆబూ అబ్రహామ్ తో కలిసి పార్క్ ( అప్పట్లో సన్ ఎన్ సీ) హోటల్ నించి వడిచి వచ్చి ఆంధ్రా యూనివర్సిటీ ఔట్ గేట్ వద్ద మసాలా వడలు తినడం.. నా భార్యతోకలిసి హనీమూన్ లో బేలూరు చూడడం.. మా అబ్బాయిల బాల్యం... ఆఖరి బంతిలో జావేద్ మియాందాద్ 6కొడితే ముఖాలు వేలాడేసిన నా పిల్లల్ని ఓదార్చడం.. తాతా అని వాటేసుకునే రోహన్. తాతీ అని డాన్సుచేసే రోహిత్, రిచాస్ తాత అని మీద వాలే రిచా.. తాతాఆఆఆఆ అని అరిచే రియా.. మొన్న పార్కులో నాటిన మొక్క నిన్న వాకింగ్ కి వెళ్ళినప్పుడు పూసి పలకరించడం.....జీవితం నవ్వుల నజరానా

2 comments:

ఆ.సౌమ్య said...

మీది విజయనగరం అని ఇప్పుడే తెలిసింది...MR కాలేజీ ల మీద పోస్టులు చూసి ఇటు పరిగెత్తుకుంటూ వచ్చాను. మాదీ ఇజీనారమే, నేను అక్కడే చదివాను. మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీ మిగతా పోస్టులన్నీ చదివి మళ్ళీ వస్తానేం!

Phani said...

aa chinni paragraph lo oka life thongi choostundandi ............!mee aksharaha amarikala enni ardhalo...