Search This Blog

Sunday, February 17, 2008

vijayanagaram marosaari

విజయనగరం పేర్లు చదివేసరికి చాలామంది మిత్రులు మెయిల్ చేశారు. శాయినాధరావు చాలామంచి మిత్రుడు. అవడానికి నాకొక యేడాది సీనియరే అయినా నాతో కలిసి బి ఎస్ సీ మూడో సంవత్సరం పరీక్ష రాశాడు. మేమిద్దరమూ కంబైండ్ స్టడీ చెసే వాళ్ళం.అతని బాబాయి తెన్నేటి వరహాలు ఇంకా ఆప్తమిత్రుడు. అతని మరణం వల్ల నేను చాలా షాకై ఒక కధ కూడా రాసేను. వీళ్ళిద్దరూ పారనంది రామ్మూర్తీ నేనూ మేమంతా రోజుల తరబడి అడ్డాట ఆడుతుండే వాళ్ళం. అనుక్షణం జోకులతో ఆనందం వెల్లివిరుస్తుండేది.వివిబి రామారావు గారిగురించి మీరన్నది కొంచెం నిజమే అయి వుంటుంది. ఆయన కొత్తగా ట్యూటరుగా చేరడమే నాకు తెలుసు. తరువాత తరువాత ఈ మధ్యలో నాకు పరిచయమైన ఒక డాక్టరు గారు ఆయన తోడల్లుడవడం చేతా, కొన్ని సంవత్సరాలక్రితం వారమ్మాయిని మా పెద్దవాడికిద్దామనుకోడం చాతా ఆయన జ్ఞాపకాలు ఇంకా మిగిలి వున్నాయి. ఆయన కొన్ని నవలలు కూడా రాసి బహుమతులు గెల్చుకున్నారు. నారాయణస్వామి తెలుగు మాస్టారే. ఆయనకి సారాకొట్టుండడం నాకు న్యూసే.అన్ని విద్యలున్నాయనుకోలేదు. ఆయనా మేం చదువుతున్నప్పుడు కొత్తగా చేరాడు.ముద్దుకృష్ణ నా క్లాస్ మేటు. చాలా నాటకాలు కలిసి వేశాం.అతన్ని డ్రమటిక్ అసోసియేషన్ సెక్రటరీ గానిలబెట్టి గెలిపించినప్పుడు కరపత్రాల మీద శ్రీశ్రీ గేయాలు ముద్రించి ఒక కొత్త వరవడిని సృష్టించాను. రేపు బయలుదేరి నా భార్యతో కంచి యాత్రకి వెళుతున్నాను.దైవభక్తి నాకు నామమాత్రమే అయినా సంస్కృతిమీద అపారమైన గౌరవం వుంది. మధురమీనాక్షి కంచి కామాక్షి కాశీ విశాలాక్షి అంటే యెందుకో తెలియని ఆప్యాయత. మళ్ళీ కలుస్తాను.

Saturday, February 2, 2008

vijayanagaram

విజయనగరం జ్ఞాపకాలు ముగిద్దామనుకుంటే ముగిసేవికాదు. ఆ వూరి సుగంధమే అంత.ముద్దుక్రిష్ణ, పెద్దిరాజు, జగ్గప్ప, మల్లపరాజుగారు, ఇనపదేముడనబడే నారాయణస్వామి గారు, రామశరమ, ఎం ఎస్ ఆర్ కేఅ, రామా, చంద్రశేఖరశర్మగారి దుర్యోధన యేకపాత్రాభినయం, వీ వీ బీ రామారావుగారు, భాస్కరరామమూర్తిగారు,స్యాంసుందర్ గారు, ఢిల్లీ నీలాచలరావు గారు, ఏ యూ ఎస్ యూనియన్ భవనంలో మేం చేసిన అల్లర్లు, మచ్చ గాడనబడే వెంకటరావు,టీ Yఏఆ నాయుడనబడేఅ అప్పలనాయుడు, సాయినాధరావు, అహ్మద్ ,వరహాలు, చైనా డాక్టరు కొడుకు, శాస్త్రి, రామదాసు, పార్ధసారధి, సత్యమూర్తి, బులుసు వారి పుస్తకాలషాపు, డీఫీ శాస్త్రి గారి పుస్తకాల షాపు, దేవీ విలాస్, నియొ మలబార్ హోటల్ లొ స్పిన్నర్ చంద్రశేఖర్ తో కలిసి మసాలాదోశ తినడం, యెన్ని స్మృతులు. వీళ్ళలో యెవరన్నా మీకూ తెలిస్తే రాస్తారా